close

తాజా వార్తలు

Updated : 25/09/2020 19:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాబోయే తరాలకు ఆ గొంతుక ఒక స్ఫూర్తి

ఎస్పీబీ మృతిపట్ల క్రికెటర్ల సంతాపం

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ గాయకుడు‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల యావత్‌ దేశం దిగ్ర్భాంతికి లోనైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లు సైతం ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా ఎస్పీబీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

* గాన గంధర్వుడు కన్నుమూశారనే వార్త తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆయన గొంతుక రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం. ఎస్పీబీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి.    -సురేశ్‌ రైనా

* బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. మనందరికీ ఆయన ఎన్నో ఆణిముత్యాలను వదిలి వెళ్లారు. -హర్షాభోగ్లే

* ఎస్పీబీ ఇక లేరని తెలిసి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన పాటలెప్పుడూ మన హృదయాల్లో నిలిచిపోతాయి. ఓం శాంతి.   -వీవీఎస్‌ లక్ష్మణ్‌

* దేవుడా.. ఈ ఏడాది.. రోజూ దారుణంగా మారుతోంది. ఎస్పీబీ గారి ఆత్మకు శాంతి చేకూరాలి.  -రవిచంద్రన్‌ అశ్విన్‌

* అతిగొప్ప గాయకుల్లో ఒకరైన బాలసుబ్రహ్మణ్యం గారి మధుర స్వరం మనందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన లోటు పూడ్చలేనిది. కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. -గౌతమ్‌ గంభీర్‌

* పాట రూపంలో మీరు ఎప్పుడూ బతికే ఉంటారు సార్‌.  -సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.