ఇప్పటికైతే సురక్షితంగా ఉన్నాం కానీ..

తాజా వార్తలు

Published : 01/08/2020 14:37 IST

ఇప్పటికైతే సురక్షితంగా ఉన్నాం కానీ..

అక్టోబర్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంటుంది: రాహుల్‌ ద్రవిడ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత దేశం ప్రస్తుతం కరోనా వైరస్‌తో సతమతమవుతోంది. రోజుకు వేలాది కేసులు నమోదవుతుండగా, వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి ఎప్పుడు నియంత్రణలోకి వస్తుందా అని యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. అప్పటి వరకూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా క్రీడాకారులపై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. అందుకు ప్రధాన కారణం దేశంలో మార్చి నుంచే లాక్‌డౌన్‌ విధించడంతో అందరు ఆటగాళ్లూ ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ తిరిగి సాధన మొదలుపెడుతున్నారు. 

ఇదే విషయంపై టీమ్‌ఇండియా మాజీ సారథి, ప్రస్తుత ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించాడు. ఓ వార్తా సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ కరోనాపై, దేశవాళి క్రికెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతానికైతే ఆటగాళ్లు సురక్షితంగానే ఉన్నారని, అయితే.. అక్టోబర్‌లో దేశవాళి క్రికెట్‌ తిరిగి  ప్రారంభమైనప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించాడు. ద్రవిడ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం పలు అంతర్జాతీయ టోర్నీలు రద్దయ్యాయని, మరికొన్ని వాయిదా పడ్డాయని చెప్పాడు. వాటిని మళ్లీ నిర్వహించడానికి సమయం దొరుకుతుందని తెలిపాడు. కానీ అక్టోబర్‌లో మాత్రం వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నాడు. అప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనపోతే పరిస్థితి చాలా దూరం వెళుతుందని వ్యాఖ్యానించాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని