close

తాజా వార్తలు

Published : 26/09/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీ చేతిలోనూ ఓటమిపాలైన చెన్నై

సమష్టిగా రాణించిన శ్రేయస్‌ టీమ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ధోనీసేన వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. దుబాయి వేదికగా దిల్లీతో తలపడిన తన మూడో టీ20లో 44 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 176 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసిస్‌(43; 35 బంతుల్లో 4x4), కేదార్‌ జాధవ్‌(26; 21 బంతుల్లో 3x4) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆదిలోనే ఓపెనర్లు మురళీ విజయ్‌(10), షేన్‌వాట్సన్‌(14) మరోసారి విఫలమయ్యారు. తర్వాత రుతురాజ్‌ గైక్వాడ్‌(5) కూడా అనవసరపు పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. దీంతో చెన్నై 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్‌, కేదార్‌ జాధవ్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేసినా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. చివర్లో కెప్టెన్‌ ధోనీ(15) క్రీజులోకి వచ్చినా అప్పటికే లక్ష్యం కొండంతగా మారింది. ఈ నేపథ్యంలో చెన్నై ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమిచెందింది. దిల్లీ బౌలర్లలో రబాడ 3, నోర్జే 2 వికెట్లు తీయగా, అక్షర్‌ పటేల్‌ మరో వికెట్‌ తీశాడు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(64; 43 బంతుల్లో 9x4, 1x6), శిఖర్‌ ధావన్‌(35; 27 బంతుల్లో 3x4, 1x6) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 10.4 ఓవర్లలో 94 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే చావ్లా బౌలింగ్‌లో తొలుత ధావన్‌ ఎల్బీగా వెనుతిరగ్గా.. స్వల్ప వ్యవధిలోనే పృథ్వీషా సైతం అతడి బౌలింగ్‌లోనే స్టంప్‌ ఔట్‌ అయ్యాడు. ఓపెనర్లు వెనుతిరిగాక రిషభ్‌ పంత్‌(37; 25 బంతుల్లో 6x4), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(26; 22 బంతుల్లో 1x4) తమ వంతుగా బ్యాటింగ్‌ చేయడంతో చెన్నై ముందు మంచి టార్గెట్‌ నిర్దేశించారు. చెన్నై బౌలర్లలో చావ్లా రెండు వికెట్లు తీయగా, సామ్‌కరన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. కాగా, ఈ విజయంతో దిల్లీ నాలుగు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అంతకుముందు మ్యాచ్‌లో పంజాబ్‌ను సూపర్‌ ఓవర్‌లో ఓడించిన సంగతి తెలిసిందే. మరోవైపు ధోనీ సేన ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి రెండు ఓటమిపాలైంది. దీంతో రెండు పాయింట్లతో ఐదో స్థానంలోనే కొనసాగుతోంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.