close

తాజా వార్తలు

Published : 07/08/2020 03:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సెన్సేషన్‌ కోసం అలా రాయొద్దు: లారా

ఇంటర్నెట్‌డెస్క్‌: తనకు కరోనా సోకిందంటూ వచ్చిన వార్తలను వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ బ్రయాన్‌ లారా ఖండించాడు. తాను పరీక్షలు జరుపుకొంటే నెగిటివ్‌ రిపోర్టు వచ్చిందని వెల్లడించాడు. తనకు పాజిటివ్‌ వచ్చిందనే వార్తలు బయట చక్కర్లు కొడుతున్నాయని, అదంతా తప్పుడు సమాచారమని స్పష్టంచేశాడు. గతరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘నా గురించి ప్రచారంలో ఉన్న తప్పుడు వార్తలన్నీ చదివాను. నాకు కరోనా సోకిందని రాశారు. అందులో నిజం లేదు. ఇది మాత్రమే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా చేయడం ద్వారా సమాజంలో మరింత ఆందోళన నెలకొనేలా చేస్తున్నారు. వ్యక్తిగతంగా నన్నేమీ ఇబ్బంది పెట్టకపోయినా వీటి ద్వారా నా బంధుమిత్రుల్లో అనవసరపు ఆందోళన నెలకొల్పారు. అందుకే చాలా కోపం వస్తోంది. అయితే, మీకో విషయం చెబుతున్నా. సెన్సేషన్‌ కోసం కరోనా వైరస్‌ను ఉపయోగించకూడదు. దాన్ని ప్రతికూలంగా చిత్రీకరించవద్దు. ఇలాంటి విపత్కర సమయంలో అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నా. ఇది భవిష్యత్‌లో ఎక్కడికి వెళుతుందో తెలియదు’ అని వ్యాఖ్యానించాడు.

ఇక వెస్టిండీస్‌ తరఫున సుదీర్ఘకాలం క్రికెట్‌ ఆడిన లారా.. 2007 ఏప్రిల్‌లో రిటైరయ్యాడు. టెస్టుల్లో అత్యధిక స్కోర్‌ (400) సాధించిన క్రికెటర్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. మొత్తం 131 టెస్టులు ఆడి 11,953 పరుగులు చేయగా.. 299 వన్డేల్లో 10,405 పరుగులు పూర్తిచేశాడు. 1990లో పాకిస్థాన్‌పై అటు వన్డేల్లో, ఇటు టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు 2007 ఏప్రిల్‌ 21 ఇంగ్లాండ్‌తో చివరి వన్డే ఆడి అన్ని ఫార్మాట్ల ఆటకు వీడ్కోలు పలికాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.