close
Array ( ) 1

తాజా వార్తలు

జులై వరకు బ్యాడ్మింటన్ టోర్నీలు వాయిదా

దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం క్రీడారంగంపై కొనసాగుతూనే ఉంది. జులై వరకు ఎటువంటి బ్యాడ్మింటన్‌ టోర్నీలూ నిర్వహించబోమని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) తెలిపింది. మే-జులైలో జరగాల్సిన అంతర్జాతీయ, జూనియర్‌, పారా టోర్నమెంట్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సోమవారం ప్రకటించింది. దీంతో హెచ్‌ఎస్‌బీసీ బీడబ్ల్యూఎఫ్ టూర్‌, బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌, ఇండోనేషియా ఓపెన్‌ టోర్నీతో సహా గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 ఈవెంట్లు వాయిదాపడ్డాయి.

‘‘ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టోర్నమెంట్స్‌ను నిలిపివేశాం. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సు ముఖ్యం’’ అని బీడబ్ల్యూఎఫ్‌ వెల్లడించింది. గ్రేడ్‌-2 అంతర్జాతీయ టోర్నమెంట్స్‌లో ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, రష్యన్‌ ఓపెన్‌ టోర్నీలు ఉన్నాయి. కరోనా ప్రభావంగా టోర్నీలన్నీ వాయిదా పడడంతో క్రీడాకారుల ర్యాంకింగ్స్‌ను ఇటీవల బీడబ్ల్యూఎఫ్‌ స్తంభింపచేసిన సంగతి తెలిసిందే. మార్చి 17 వరకు ఎవరు ఏ ర్యాంకులో ఉంటే ఆ ర్యాంకులోనే కొనసాగనున్నారని తెలిపింది.

షూటింగ్‌ ప్రపంచకప్‌ రద్దు
కరోనా కారణంగా షూటింగ్‌ ప్రపంచకప్‌నూ రద్దు చేశారు. దేశ రాజధాని దిల్లీ వేదికగా మే-జూన్‌లో జరగాల్సిన షూటింగ్‌ ప్రపంచకప్‌ను రద్దు చేస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్‌ ఫెడరేషన్‌ (ఐఎస్ఎస్‌ఎఫ్) తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 15-26న జరగాల్సిన ఈ టోర్నీని మే-జూన్‌కు వాయిదా వేశారు. మే 5-12న రైఫిల్‌/పిస్టల్, జూన్‌ 2-9న షాట్‌గన్‌ పోటీలు జరగాల్సి ఉంది. కానీ పరిస్థితుల దృష్ట్యా ప్రపంచకప్‌ను రద్దు చేస్తున్నట్లు ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రకటించింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.