అర్జున్‌ తెందుల్కర్‌కు తప్పని నిరాశ!

తాజా వార్తలు

Published : 28/12/2020 00:59 IST

అర్జున్‌ తెందుల్కర్‌కు తప్పని నిరాశ!

ఇంటర్నెట్‌డెస్క్‌: దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్ తెందుల్కర్‌కు నిరాశే మిగిలింది. దేశవాళీ టీ20 టోర్నీలో సత్తాచాటి తన కెరీర్‌కు బాటలు వేసుకుందామనుకున్న అతడు ముంబయి జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. సయ్యద్‌ ముస్తాక్ అలీ టోర్నీకి 20 మందితో ప్రకటించిన ముంబయి జట్టులో అతడికి చోటు దక్కలేదు. సూర్యకుమార్‌ యాదవ్ ఆ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

అయితే ఆల్‌రౌండర్‌ అర్జున్‌ తొలుత ముంబయి జట్టుతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. కానీ అతడు సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయాడు. నాలుగు వికెట్లు, ఏడు పరుగులు మాత్రమే సాధించాడు. టీమ్‌-బి×టీమ్‌-డి మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌లో సూర్యకుమార్‌ విధ్వంసమే సృష్టించాడు. అర్జున్‌ వేసిన 13వ ఓవర్‌లో బౌండరీలతో చెలరేగి 21 పరుగులు సాధించాడు. కాగా, ముంబయి జట్టులో శివమ్ దూబే, యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధావల్‌ కులకర్ణి ఉన్నారు.

నవరి 10 నుంచి 31 వరకు నిర్వహించనున్న సయ్యద్ ముస్తాక్‌ అలీ టోర్నీ ఆరు రాష్ట్రాల్లో జరుగనుంది. బయోసెక్యూర్‌ వాతావరణంలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. బయోబబుల్‌లో ఆటగాళ్లు జనవరి 2న ప్రవేశిస్తారు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో సత్తాచాటిన ఆటగాళ్లు ఐపీఎల్‌ వేలంలో కీలకంగా మారతారు.

ఇదీ చదవండి

నాయకుడై నడపించాడు

ధోనీ, కోహ్లీనే ఈ దశాబ్దపు సారథులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని