
తాజా వార్తలు
10 మంది పాక్క్రికెటర్లకు కరోనా
ఇంటర్నెట్‌డెస్క్: ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు అక్కడికి చేరుకున్న పాక్ క్రికెటర్లకు కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతోంది. తొలుత ఆరుగురికి ఈ వైరస్ సోకగా తర్వాత మరొకరికి వ్యాపించింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఇంకో ముగ్గురు క్రికెటర్లు దాని బారిన పడ్డారు. దీంతో ఆ జట్టులో మొత్తం వైరస్‌కు గురైన ఆటగాళ్ల సంఖ్య 10కి చేరింది. ఈనెల 24న 34 మంది ఆటగాళ్లు, 20 మంది సిబ్బందితో పాక్ క్రికెట్ జట్టు క్రైస్ట్‌చర్చ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడ పలువురు ఆటగాళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రవర్తించారని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తొలిసారి వారికి నిర్వహించిన పరీక్షల్లో ఆరుగురు క్రికెటర్లకు పాజిటివ్‌గా తేలింది. రెండు రోజుల కింద నిర్వహించిన పరీక్షల్లో ఒకరికి, తాజా పరీక్షల్లో మరో ముగ్గురికి వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో పాక్ క్రికెట్ జట్టులో పెద్ద కలవరం మొదలైంది. ఇప్పడింత మంది వైరస్ బారిన పడడంతో జరగాల్సిన మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.
లూయిస్ హామిల్టన్‌కు పాజిటివ్..
మరోవైపు ఫార్ములా వన్ రేసర్ లూయిస్ హామిల్టన్ కరోనా బారిన పడ్డాడని, దీంతో ఈ వారం చివర్లో బహ్రెయిన్‌లో జరగాల్సిన సాఖిర్ గ్రాండ్ ప్రి ఈవెంట్లో అతడు పాల్గొనట్లేదని మెర్సిడెజ్ బెంజ్ రేసింగ్ టీమ్ ట్విటర్లో తెలిపింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడని, లూయిస్‌ని కలిసిన వారిని గుర్తించి వారికి సమాచారం అందించామని చెప్పింది. సాఖిర్ ఈవెంట్లో పాల్గొనడానికి ముందు లూయిస్‌కు గతవారం మూడుసార్లు పరీక్షలు చేసినా నెగిటివ్ వచ్చిందని, అయితే.. సోమవారం స్వల్ప లక్షణాలు కనపడడంతో మరోసారి కొవిడ్ 19 పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఈ వారంతంలో జరిగే సాఖిర్ గ్రాండ్ ప్రీలో పాల్గొనాలంటే మెర్సిడీజ్ టీమ్ లూయిస్‌కు బదులు మరో డ్రైవర్‌ను నియమించాల్సి ఉంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
