close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెరాస ప్రభుత్వమే పేదలకు అండ

మతం పేరుతో భాగ్యనగరంలో చిచ్చుకు కుట్ర
కూకట్‌పల్లి రోడ్‌షోల్లో మంత్రి కేటీఆర్‌

మూసాపేట, కూకట్‌పల్లి, అల్లాపూర్‌, న్యూస్‌టుడే: తెరాస ప్రభుత్వం మాత్రమే మొదటి నుంచి పేదలకు అండగా నిలిచిందని, సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస సెంచరీ కొట్టడం ఖాయమన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన శనివారం సాయంత్రం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లాపూర్‌, మూసాపేట, బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తా, ఐడీపీఎల్‌ చౌరస్తాల్లో ప్రసంగించారు. 350 ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలను నెలకొల్పామన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఓట్లను దండుకోవడం కోసం హిందూ ముస్లింల మధ్య కొందరు చిచ్చు పెట్టడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. నగరంలో ఎన్నో ఆలయాలున్నా ఆ నాయకులు కావాలనే భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఎంచుకోవడం మత ఘర్షణలు సృష్టించడానికే అని అన్నారు. రెండు పడక గదుల ఇళ్లు లక్ష సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. బాలానగర్‌ చిత్తారమ్మబస్తీలో లబ్ధిదారులకు అందజేసిన తరహాలోనే మిగతా ప్రాంతాల్లోని అర్హులకు త్వరలో అందజేస్తామని హామీనిచ్చారు. బాలానగర్‌లోని ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి రూ.400 కోట్లతో వంతెన నిర్మిస్తున్నామన్నారు. రూ.60 కోట్లతో ఫతేనగర్‌ బ్రిడ్జిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరో రూ.40 కోట్లతో అండర్‌ పాస్‌ బ్రిడ్జిని సైతం నిర్మిస్తున్నామన్నారు. అల్లాపూర్‌ డివిజన్‌లో ప్రభుత్వ ఆసుపత్రి, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలను నిర్మిస్తామని చెప్పారు. అభ్యర్థులు మందడి శ్రీనివాసరావు, సబిహాబేగం, తూము శ్రావణ్‌కుమార్‌, పగడాల శిరీష, పండాల సతీష్‌గౌడ్‌, ఆవుల రవీందర్‌రెడ్డి, ముద్దం నర్సింహయాదవ్‌, జూపల్లి సత్యనారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రి పువ్వాడ అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.