close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అసోం, బెంగాల్‌లో ఘర్షణలు

తేజ్‌పుర్‌/కోల్‌కతా: అయోధ్యలో రామాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని భాజపా, బజరంగ్‌ దళ్‌ శ్రేణులు నిర్వహించిన ప్రదర్శనలు పలు చోట్ల ఘర్షణలకు దారితీశాయి. అసోం సోనిత్‌పుర్‌ జిల్లాలో బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు బైక్‌లపై ప్రదర్శన నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదం తీవ్ర వివాదానికి దారి తీసింది. రెండు వర్గాల వారికి సర్దిచెబుతుండగా డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ మానవేంద్ర ప్రతాప్‌ సింగ్‌పై దుండగులు దాడి చేసి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. తెలమర, ధేకియాజులి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు.
పశ్చిమ బెంగాల్‌లో...
అనుమతి లేకుండా ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్న భాజపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవటంతో పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పుర్‌, నారాయణ్‌పుర్‌, అలీపుర్‌ద్వార్‌లలో వివాదం చెలరేగింది.  ఆయా ఘటనల్లో పోలీసులతో పాటు భాజపా కార్యకర్తలు పలువురు గాయపడ్డారు. దక్షిణ 24 పరగణాల జిల్లా.. దోలాహట్‌లోని ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించటంతో వివాదం తలెత్తింది. పరస్పర దాడుల్లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అడ్డుకోబోయిన 12 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ సందర్భంగా 20 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.