సైకిల్‌ గుర్తుకు ఓటేయండన్న వైకాపా ఎమ్మెల్యే

తాజా వార్తలు

Updated : 05/04/2021 11:58 IST

సైకిల్‌ గుర్తుకు ఓటేయండన్న వైకాపా ఎమ్మెల్యే

ఉంగుటూరు: రాజకీయ నాయకులు ఫ్లోలో చాలా చెబుతుంటారు. కాకపోతే కొందరు వెంటనే నాలుక కరచుకొని అంతా తూచ్‌ అంటారు. కొందరు తేరుకొని కవర్‌ చేస్తారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు కూడా అలానే చేశారు. వైకాపా జడ్పీటీసీ అభ్యర్థి జయలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి గంటా శ్రీలక్ష్మి తరఫున ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో ఎమ్మెల్యే ప్రాదేశిక ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. మైక్‌ అందుకున్న ఎమ్మెల్యే సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. అప్పటి వరకు ఓటర్ల వైపు దండం పెడుతూ నిల్చున్న వైకాపా అభ్యర్థులు ఒక్కసారిగా అవాక్కై ఎమ్మెల్యే వైపు చూశారు. ప్రచార వాహనం చూట్టూ చేరిన వారు కూడా ఫక్కున నవ్వారు. ఎక్కడో తేడా కొట్టిందని గ్రహించిన ఎమ్మెల్యే వెంటనే కవర్‌ చేశారు. సైకిల్‌ గుర్తుపై ఓటేయాలంటూ జోక్‌ చేశానని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే ఎంత సర్ది చెప్పినా సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఈ వీడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని