ఉద్యోగ దీక్ష విరమించిన వైఎస్‌ షర్మిల

తాజా వార్తలు

Updated : 18/04/2021 14:21 IST

ఉద్యోగ దీక్ష విరమించిన వైఎస్‌ షర్మిల

రెండేళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది: షర్మిల

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంఘీభావంగా చేపట్టిన 72 గంటల ఉద్యోగ దీక్షను వైఎస్‌ షర్మిల ఆదివారం మధ్యాహ్నం విరమించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ రెండు రోజుల కిందట ఇందిరా పార్క్‌ వద్ద షర్మిల ఉద్యోగ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. పోలీసులు ఒక్క రోజు దీక్షకే అనుమతించినా 72 గంటలు కొనసాగిస్తానని ఆమె ప్రకటించడంతో పోలీసులు అడ్డుకొని ఆమె నివాసానికి తరలించారు. దీంతో షర్మిల నివాసంలోనే దీక్ష కొనసాగించారు. దీక్ష విరమించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వకుండా నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

‘‘ రాష్ట్రంలో ఏడేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. 40 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు వచ్చే వరకు నియోజకవర్గాల్లో మా కార్యకర్తలు దీక్షలు చేస్తారు. రెండేళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏం చేసైనా నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని మాటిస్తున్నా’’ అని షర్మిల అన్నారు. ఈ ఏడాది జులై 8న పార్టీ ప్రకటన చేస్తానని ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని