సీఎం మార్పు లేదు.. యడియూరప్ప పనితీరు భేష్‌! 

తాజా వార్తలు

Published : 11/06/2021 01:51 IST

సీఎం మార్పు లేదు.. యడియూరప్ప పనితీరు భేష్‌! 

భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ వ్యాఖ్యలు

దిల్లీ: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని భాజపా అధిష్ఠానం స్పష్టత ఇచ్చింది. సీఎంగా యడియూరప్పే కొనసాగుతారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక భాజపా ఇన్‌ఛార్జి అరుణ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. త్వరలోనే తాను కర్ణాటకకు వెళ్తానని చెప్పారు. ఎమ్మెల్యేలు ఎవరైనా కోపంగా ఉంటే ఆ అంశాలను తమ ముందు ఉంచొచ్చన్నారు. అలాగే, వారిలోని అసంతృప్తిని కూడా పార్టీ వేదికల్లో వ్యక్తపరచవచ్చని సూచించారు. యడియూరప్ప బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. 

ఇటీవల భాజపా సీనియర్‌ నేత, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప గవర్నర్‌కు సీఎం యడియూరప్పపై ఫిర్యాదు చేయడం కన్నడ రాజకీయాల్లో కలకలం రేపాయి. సీఎం తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారని ఆయన గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. యడియూరప్ప రాజీనామాను ఆయన కోరనప్పటికీ.. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య యడ్డీ రాజీనామాకు డిమాండ్‌ చేశారు. 

ఈ వ్యవహారంలో గవర్నర్‌ జోక్యం చేసుకొని కర్ణాటకలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని సిద్ధరామయ్య కోరారు. అయితే, పార్టీ కేంద్ర నాయకత్వం కోరుకుంటే తాను సీఎం పీఠం నుంచి దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు, మంత్రి ఈశ్వరప్ప గవర్నర్‌ వాజుభాయి వాలాకు ఐదు పేజీల లేఖ రాశారు. యడియూరప్ప నిరంకుశత్వం, పాలనలో తీవ్ర లోపాలను ఎత్తిచూపారు. ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలు దిల్లీ వెళ్లి పార్టీ అధిష్ఠానాన్ని కలిసి రావడం వంటి పరిణామాలతో కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందనే ఊహాగానాలు చెలరేగిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని