బెంగాల్‌లో కొనసాగుతున్న 4వ దశ పోలింగ్‌

తాజా వార్తలు

Updated : 10/04/2021 11:02 IST

బెంగాల్‌లో కొనసాగుతున్న 4వ దశ పోలింగ్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి నాలుగో దశ ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ దశలో భాగంగా మొత్తం 44 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 1.15కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ రోజు జరుగుతున్న పోలింగ్‌లో అన్ని స్థానాల్లో కలిపి మొత్తం 373 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఇందుకోసం మొత్తం 15,940 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 80వేల మంది కేంద్ర భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

ఈ దశలో కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో టోలీగంజ్‌ నుంచి బరిలో ఉన్నారు. మరోవైపు బెహెలా నియోజకవర్గం నుంచి టీఎంసీ కీలక నేత, మంత్రి పార్థ ఛటర్జీపై భాజపా తరపున  సినీ నటి పాయల్‌ సర్కార్‌ పోటీ చేస్తున్నారు. కాగా, గత 2016 ఎన్నికల్లో ఈ 44 స్థానాల్లో అధికార టీఎంసీ కేవలం 5  మినహా అన్ని స్థానాల్లో విజయం సాధించింది. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని