నన్ను పిలవకుండా వ్యాక్సిన్‌ సెంటర్‌ ఓపెనింగా?

తాజా వార్తలు

Published : 08/05/2021 01:14 IST

నన్ను పిలవకుండా వ్యాక్సిన్‌ సెంటర్‌ ఓపెనింగా?

ముంబయి: ‘‘లోకల్‌ ఎమ్మెల్యే అయిన నన్ను పిలవకుండా వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తారా? కనీసం ప్రొటోకాల్‌ పాటించరా?’’ అంటూ మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పారు. పోనీ ఆయన ఏమైనా ప్రతిపక్ష పార్టీ సభ్యుడా అంటే అదీ కాదు. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే. వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ప్రారంభించింది శివసేనకు చెందిన మంత్రి. రెండూ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములే! అయినా విపత్తు వేళ రాజకీయ నేతలు ఎలా వ్యవహరించకూడదనడానికి ఈ ఘటనే నిదర్శనం.

వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని బాంద్రా ఈస్ట్‌ నియోజకవర్గంలో గురువారం శివసేనకు చెందిన మంత్రి అనిల్‌ పరబ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీషన్‌ సిద్ధిఖీ దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారు. తనను పిలవకుండా వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ప్రారంభించారని, స్థానిక ఎమ్మెల్యే అన్న కనీస ప్రొటోకాల్‌ పాటించరా అంటూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. పైగా వ్యాక్సిన్ల విషయంలోనూ రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. అంతేకాదు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్ (ఎన్సీపీ)‌, కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ నేత బాలా సాహెబ్‌ థరోట్‌ను ట్యాగ్‌ చేశారు. ఈ ట్వీట్‌కు ఏఐసీసీ మహారాష్ట్ర ఇన్‌ఛార్జి హెచ్‌కె పాటిల్‌ లైక్‌ చేయడం కొసమెరుపు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని