‘అధికారులున్నది చెప్పులు మోయడానికే’.. ఉమా భారతి వివాదాస్పద వ్యాఖ్యలు!

తాజా వార్తలు

Updated : 21/09/2021 05:08 IST

‘అధికారులున్నది చెప్పులు మోయడానికే’.. ఉమా భారతి వివాదాస్పద వ్యాఖ్యలు!

భోపాల్‌ (మధ్యప్రదేశ్‌): మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ ఇలాంంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆమె ఈ సారి ప్రభుత్వ అధికారులపై నోరు పారేసుకున్నారు. ‘అధికారులున్నది చెప్పులు మోయడానికే’నంటూ మరో కొత్త వివాదానానికి తెరలేపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఓబీసీకి చెందిన పలువురు శనివారం ఉమా భారతిని భోపాల్‌లోని ఆమె నివాసంలో కలిశారు. కులగణన చేపట్టాలని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఉమా భారతి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ అధికారుల చేతిలో ఏమీ ఉండదు. వాళ్లున్నది మా చెప్పులు మోయడానికే. ఆ పని చేయడానికి మేం వారికి ఆ అవకాశం ఇస్తుంటాం. అంతకుమించి వారికెలాంటి సామర్థ్యం లేదు’’ అని ఉమాభారతి వ్యాఖ్యానించినట్లుగా వీడియోలో ఉంది.

‘‘చాలా మంది రాజకీయ నాయకులను బ్యూరోక్రాట్లు నియంత్రిస్తుంటారని ఎందుకు అనుకుంటారు? మేం చెప్పిందే వాళ్లు చేస్తారు. మేం చర్చించాకే వాళ్లు ఫైల్‌ తయారుచేసి తీసుకొస్తారు. 11 ఏళ్లుగా కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నా. అలాంటి అధికారులు రాజకీయ నాయకులను నియంత్రిస్తుంటారనుకోవడంలో అర్థం లేదు. వాళ్లకు మేం జీతాలు, ప్రమోషన్లు ఇస్తాం. నిజంగా చెప్పాలంటే మా రాజకీయాల కోసం వారిని వాడుకుంటాం’’ అంటూ ఉమా భారతి వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలను ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఖండించింది. ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గు చేటని, దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని