వీటికి సమాధానం చెప్పండి.. మోదీ ప్రభుత్వానికి తృణమూల్‌ ప్రశ్నల వర్షం

తాజా వార్తలు

Published : 13/08/2021 01:37 IST

వీటికి సమాధానం చెప్పండి.. మోదీ ప్రభుత్వానికి తృణమూల్‌ ప్రశ్నల వర్షం

కోల్‌కతా: ప్రధాని మోదీ ప్రభుత్వంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మన్మోహన్‌ హయాంతో పోలుస్తూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తూ 8 మంది కేంద్రమంత్రులు విలేకరుల సమావేశం నిర్వహించడానికి ప్రతిగా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ డెరెక్‌ ఓబ్రెయిన్‌ పలు ప్రశ్నలు సంధించారు. పెగాసస్‌, రైతు చట్టాలపై సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయిందంటూ విమర్శించారు.

* మాజీ ప్రధానులు మన్మోహన్‌, దేవెగౌడ చర్చల్లో పాల్గొనేవారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా సమాధానం ఇవ్వకుండా ఎక్కడికి వెళ్లారు?

* దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన పెగాసస్‌ అంశంపై  విపక్షాలు పట్టుబట్టినా ప్రభుత్వం కనీసం చర్చకు రానివ్వలేదు. రైతు చట్టాలపైనా చర్చించాలని కోరినా ఎందుకు చర్చకు ఆహ్వానించలేదు?

* రాజ్యసభలో చర్చ జరగకుండానే మొత్తం 39 బిల్లులు ఆమోదం పొందాయి. ఇలానే ప్రజాస్వామ్య దేశం నడిచేది? ఒక్కో బిల్లుకు 10 నిమిషాలా? పైగా సమావేశాలకు విపక్షాలు అంతరాయం కలిగించాయని చెప్పడం ఏంటి?

* 2014లో 60-70 శాతం బిల్లులు పార్లమెంటరీ కమిటీ ముందుకు వెళ్లేవి. ఇప్పుడు 11 శాతం బిల్లులు మాత్రమే ఎందుకుంటున్నాయి?

* ఒకప్పుడు కేవలం ముఖ్యమైన బిల్లులకు మాత్రమే ఆర్డినెన్స్‌లు తెచ్చేవారు. 10 బిల్లులకు కేవలం ఒక్క ఆర్డినెన్స్‌ మాత్రమే వచ్చేది. ఇప్పుడు 10 బిల్లులకు నాలుగు చొప్పున ఆర్డినెన్సులు తెస్తున్నారు. భాజపా పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది.

* మన్మోహన్‌ సింగ్‌ సమాధానాలు ఇచ్చేవారు. ప్రధాని మోదీ ఎందుకు ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వడం లేదు. 

* రాజ్యసభలో మాకు మెజారిటీ ఉందని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. రెండేళ్లుగా ఎందుకు డిప్యూటీ స్పీకర్‌ను నియమించలేదు? అంటూ డెరెక్‌ ప్రశ్నించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని