YSRCP: పవన్‌ మాటలు చూస్తుంటే పిచ్చి పరాకాష్టకు చేరినట్టుంది: వైకాపా

తాజా వార్తలు

Updated : 29/09/2021 20:18 IST

YSRCP: పవన్‌ మాటలు చూస్తుంటే పిచ్చి పరాకాష్టకు చేరినట్టుంది: వైకాపా

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పవన్‌ కల్యాణ్‌ ఏ నిమిషంలో ఏమైనా మాట్లాడగలరని, ఆయన మాటలు పిచ్చితనంగా ఉన్నాయని విమర్శించారు. ఆయన మాటలు చూస్తుంటే పిచ్చి పరాకాష్టకు చేరినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. స్టార్‌ డమ్‌ అడ్డం పెట్టుకుని ఏది మాట్లాడినా చెల్లుతుందని భావిస్తున్నారన్నారు. రాష్ట్ర సమస్యలపై పవన్‌కు అవగాహన లేదన్నారు. వర్గాల మధ్య పోరు సృష్టించి, వివాదాల మధ్య లబ్ధిపొందాలని పవన్‌ అనుకుంటున్నారన్నారు.  సినిమా రంగం వల్ల పవన్‌ బాగుపడ్డారు తప్ప.. పవన్‌ వల్ల సినిమా రంగం బాగుపడలేదని వ్యాఖ్యానించారు.

జనసైనికులు పవన్‌ ను నమ్ముకుంటే తోకపట్టుకుని గోదారి ఈదినట్టే ఉంటుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల వల్ల 6.81 కోట్ల మందికి రూ.లక్ష కోట్ల పైనే లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని పవన్‌ తెలుసుకోవాలన్నారు. గత ఐదేళ్ల తెదేపా పాలనలో రాష్ట్రంలో రోడ్ల మరమ్మతు చేయలేదని, వైకాపా అధికారంలోకి వచ్చాక వర్షాలు కురవడం వల్ల  రోడ్ల పరిస్థితి బాగోలేదన్నారు. మరమ్మతుల కోసం రూ.2వేల కోట్లతో టెండర్లు పిలిచిన సంగతి పవన్‌ కల్యాణ్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ప్రైవేటు సైట్లు లెక్కాపత్రం లేకుండా ప్రేక్షకులను దోచుకుంటున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం రూ.100 టికెట్‌పై కేవలం రెండు రూపాయలు మాత్రమే వసూలు చేస్తుందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని