Revanth reddy: రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించిన తెరాస కార్యకర్తలు

తాజా వార్తలు

Updated : 21/09/2021 17:14 IST

Revanth reddy: రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించిన తెరాస కార్యకర్తలు

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన తెరాస కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు తెరాస శ్రేణులు యత్నించగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుని కర్రలతో వెంటపడ్డారు. తెరాస కార్యకర్తలు రాళ్లతో ఎదురు దాడి చేసేందుకు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో వెంటపడటంతో తెరాస కార్యకర్తలు అక్కడ నుంచి పరుగులు తీయాల్సి వచ్చింది.

గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్‌ల మధ్య ట్విటర్ వేదికగా జరుగుతున్న విమర్శలు, ప్రతి విమర్శలే రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి దారితీసింది. కేటీఆర్‌ మాదక ద్రవ్యాలు వాడలేదని, పరీక్షలు చేయించుకోవాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్‌ను విసిరారు. నిన్న గన్ పార్కు వద్దకు రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ కేటీఆర్‌ రాలేదు. రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయనపై పరువునష్టం దావా వేశారు. ఇదే క్రమంలో ఇవాళ కొంతమంది తెరాస కార్యకర్తలు రేవంత్ రెడ్డి  ఇంటిని ముట్టడించేందుకు వెళ్లారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ఆయన నివాసం వద్దకు వెళ్లిన తెరాస కార్యకర్తలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు తెరాస శ్రేణులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

తెరాస శ్రేణుల ముట్టడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. మళ్లీ గొడవ జరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా రేవంత్ నివాసం వద్ద పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. రేవంత్‌ ఇంటికి 200 మీటర్ల వరకు ప్రత్యేక పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని