Somireddy: ఏపీలో వ్యవసాయశాఖ మూతపడింది.. రైతులకు జగన్‌ వెన్నుపోటు

తాజా వార్తలు

Updated : 12/09/2021 16:16 IST

Somireddy: ఏపీలో వ్యవసాయశాఖ మూతపడింది.. రైతులకు జగన్‌ వెన్నుపోటు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి, రైతులకు ముఖ్యమంత్రి జగన్ వెన్నుపోటు పొడిచారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయశాఖ మూతపడిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో దళారులు చేరి చివరకు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయమంటే తెలియని కన్నబాబుకి వ్యవసాయ శాఖ, నీటిపారుదల పదానికి అర్థం తెలియని అనిల్ కుమార్‌కు నీటిపారుదలశాఖ అప్పగించారని ఆక్షేపించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు రథం పథకం కింద రైతులకు 20వేల ట్రాక్టర్లను పంపిణీ చేయగా.. వైకాపా కనీసం ఒక్క నాగలి కూడా ఇచ్చిందిలేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగానికి, రైతులకు సంబంధించిన ఏ పథకంలోనైనా జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ముందంజలో ఉందా అని సోమిరెడ్డి నిలదీశారు.

తెదేపా హయాంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11శాతం వృద్ధిరేటు నమోదైందని తెలిపారు. వైకాపా ప్రభుత్వ పాలనలో ఎంత నమోదైంది? దేశం.. రాష్ట్రం.. ఏ స్థానంలో ఉందో చెప్పగలరా అని సవాల్‌ విసిరారు. ఈ రెండున్నరేళ్లలో జగన్ సర్కార్‌ రైతులకు ఏం చేసిందని ప్రశ్నించారు. రైతు లేకపోతే దేశమే లేదనే వాస్తవాన్ని పాలకులు ఎందుకు విస్మరిస్తున్నారని ఆక్షేపించారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు తెదేపా ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు పెడితే, వైకాపా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. ఈ రెండున్నరేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో పూర్తి వివరాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని