ap News: చంద్రబాబు ఆరోపణలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం: సజ్జల

తాజా వార్తలు

Updated : 05/10/2021 20:12 IST

ap News: చంద్రబాబు ఆరోపణలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం: సజ్జల

అమరావతి: తెదేపా నేతలు డ్రగ్స్‌ ఇష్యూని ఆంధ్రప్రదేశ్‌కు అంటగట్టాలని చూస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎక్కడ  ఏది జరిగినా ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో గుజరాత్‌లోని ముంద్రాపోర్టులో డ్రగ్స్‌ దొరికితే ఏపీకి ఏం సంబంధముందని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు డ్రగ్స్‌ బిజినెస్‌లోకి దిగారేమోనన్న అనుమానం కలుగుతోందని సజ్జల ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 2.5లక్షల కిలోల గంజాయి పట్టుకున్నామని వివరించారు. ‘‘ఆధారాలు లేకుండా తెదేపా నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. డ్రగ్స్‌ అంశంపై సీబీఐ, డీఆర్‌ఐ విచారణ జరపాలి. పాండోరా పత్రాల్లో జగన్‌ పేరు ఉండొచ్చన్న వ్యాఖ్యలు దారుణం. చంద్రబాబు ఆరోపణలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని సజ్జల అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని