TS News: సేంద్రియ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నిరంజన్‌ రెడ్డి

తాజా వార్తలు

Updated : 07/10/2021 15:09 IST

TS News: సేంద్రియ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో సేంద్రియ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి శాసనమండలిలో వెల్లడించారు. సేంద్రియ సాగు ప్రోత్సహాకాలపై ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2017-18 నుంచి మూడేళ్లుగా పథకం అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. 584 క్లస్టర్లు, 29,200 ఎకరాల విస్తీర్ణంలో సేంద్రియ సాగు అభివృద్ధి చేశామన్నారు. బడ్జెట్‌లో సేంద్రియ సాగుకు రూ.72 కోట్లు కేటాయించి రూ.25.98 కోట్లు వ్యయం చేశామని వివరించారు. రసాయన కూరగాయలు తినవద్దనే అవగాహన ప్రజల్లో పెరిగిందని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ పరిధిలో మూడేళ్లలోనే 26వేల మిద్దె తోటలు పెరగడమే అందుకు నిదర్శమని వెల్లడించారు. జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్‌ మండలం ఎనబాదిలో మహిళలు 150 నుంచి 200 ఎకరాల్లో సేంద్రియ కూరగాయలు పండిస్తున్నారని సహజ పేరుతో విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. తనకు 37 ఎకరాల్లో సర్టిఫైడ్ అర్గానిక్‌ తోట ఉందని మండలిలో చెప్పడంతో ప్రజాపతినిధులకు మరింత అవగాహన కల్పించాలని ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌ రెడ్డి మంత్రికి సూచించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని