PK-Congress: ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ ఎంట్రీపై.. సీనియర్‌ నేతలు ఏమంటున్నారంటే..!

తాజా వార్తలు

Published : 13/09/2021 01:23 IST

PK-Congress: ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ ఎంట్రీపై.. సీనియర్‌ నేతలు ఏమంటున్నారంటే..!

పార్టీలో సంస్కరణలు తప్పనిసరి అన్న కేంద్ర మాజీ మంత్రి

దిల్లీ: ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని గతకొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే, వీటిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా వీటిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ స్పందించారు. ప్రశాంత్‌కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరడాన్ని సమర్థిస్తున్నట్లు పేర్కొన్న ఆయన.. పార్టీలో సంస్కరణలు తీసుకురావడం మంచిదేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీలోకి చేరడాన్ని వ్యతిరేకిస్తోన్న వారు అలా చేయవద్దని పిలుపునిచ్చారు.

ప్రశాంత్‌ కిశోర్‌ రావడం పట్ల కాంగ్రెస్‌ పార్టీకి ప్రయోజనం ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు వీరప్ప మొయిలీ స్పందించారు. ఎన్నికల వ్యూహకర్తగా ఆయన వ్యూహాలతో విజయవంతమైనట్లు ఇప్పటికే నిరూపితమైంది. అందుకే బయట నుంచి పనిచేయడం కంటే అతను (ప్రశాంత్‌ కిశోర్‌) పార్టీలో చేరితే తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నాను. పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సోనియాగాంధీతో ఓ బలమైన శక్తి చేతులు కలపాల్సి ఉంది. అందుకే ఆయన ప్రణాళిక, వ్యూహంతో కాంగ్రెస్‌ పార్టీకి ఇలాంటి శక్తిని ప్రశాంత్ కిశోర్‌ ఇస్తారని ప్రతిపాదించానని వీరప్ప మొయిలీ పేర్కొన్నారు.

దేశంలో ఎన్నికల సమయంలో పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్‌.. తాను ఆ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానంతో పలుసార్లు భేటీ కావడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం మొదలయ్యింది. దీనిని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల్లోనే కొందరు వ్యతిరేకిస్తుండగా మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పలు సీనియర్‌ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీలో చేరికపై మాత్రం సోనియాగాంధీనే తుది నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని