Ts News: అక్కడి అభివృద్ధిపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ నేతలకు లేదు: నిరంజన్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 14/10/2021 13:46 IST

Ts News: అక్కడి అభివృద్ధిపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ నేతలకు లేదు: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలకు పాలమూరు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏళ్ల తరబడి పాలించి కృష్ణా నదిపై ప్రాజెక్టులు కట్టలేదన్నారు. తెదేపాలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ కారణంగానే పాలమూరు జిల్లా నాశనం అయిందని విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తెరాసపై అసత్యాలు చెబుతున్నారని నిరంజన్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘‘80 వేల నియామకాలు చేపడతామని ఉద్యోగ నియామకాలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఏటా ఉద్యోగాలపై క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నీ తెరాస ప్రభుత్వం అమలు చేసింది. ప్రైవేటు రంగంలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్‌కు అనేక కంపెనీలు వచ్చాయి’’ అని అన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని