Ap News: చంద్రబాబుకు ఆ విషయం ఎవరు  చెప్పారు?: కొడాలి నాని

తాజా వార్తలు

Updated : 10/10/2021 17:15 IST

Ap News: చంద్రబాబుకు ఆ విషయం ఎవరు  చెప్పారు?: కొడాలి నాని

హైదరాబాద్‌: మాదకద్రవ్యాల సరఫరాలో అఫ్గానిస్థాన్‌ టు తాడేపల్లికి లింకులున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను మంత్రి కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్‌ సరఫరా అంశంలో ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధాలున్నాయని చంద్రబాబుకు ఎవరు చెప్పారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నిలువునా మోసం చేశారని.. ఎన్నికల నాటికి ఉన్న అప్పును 4 విడతల్లో చెల్లిస్తానని సీఎం జగన్‌ హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారన్నారు. రెండు విడతల్లో కలిపి రూ.13 వేల కోట్లు మహిళా సంఘాలకు సీఎం జగన్ చెల్లించారన్నారు.

ఆయన ఉన్నంతకాలం జగనే రాష్ట్రానికి సీఎంగా ఉంటారని జోస్యం చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి నాటకాలు ఆడుతున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. జనసేనతో కలవాలని చంద్రబాబు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు జనసేన, తెదేపాను భూస్థాపితం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కొడాలి నాని విమర్శించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని