KTR: ఈనెల 25న తెరాస అధ్యక్షుడి ఎన్నిక: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 13/10/2021 13:20 IST

KTR: ఈనెల 25న తెరాస అధ్యక్షుడి ఎన్నిక: కేటీఆర్‌

హైదరాబాద్‌: ఈ నెల 25న తెరాస అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రెండేళ్లకోసారి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్ష ఎన్నిక వివరాలను కేటీఆర్‌ వెల్లడించారు. ఈనెల 17 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందన్నారు.  23న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ చేపడతామని చెప్పారు. 25న తెరాస అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. 

నవంబర్‌ 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఈనెల 27న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీనికి సంబంధించిన సన్నాహక సభలు నిర్వహిస్తామన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని