Ap News: కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కొడాలి నాని

తాజా వార్తలు

Published : 22/09/2021 02:11 IST

Ap News: కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కొడాలి నాని

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే తెదేపా అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 శాతం జడ్పీటీసీలు, 85 శాతం ఎంపీటీసీ స్థానాలను వైకాపా కైవసం చేసుకుందన్నారు. కుప్పం, నారావారిపల్లె, నిమ్మకూరులోనూ వైకాపా గెలిచిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు అభ్యర్థులు దొరికే పరిస్థితి ఉండదని వెల్లడించారు. కుప్పంలో చంద్రబాబును తప్పకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని