గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోం: పవన్‌

తాజా వార్తలు

Published : 21/07/2021 01:09 IST

గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోం: పవన్‌

అమరావతి: నిరుద్యోగ యువత పట్ల జనసేన నిలుస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. అర్ధరాత్రి అరెస్టులు, నిర్బంధాలతో జనసేన నాయకులు, శ్రేణులను నిలువరించలేరన్నారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని నమ్మిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం చేసిన వంచనను ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం శాంతియుతంగా కార్యక్రమాన్ని చేపడితే నోటీసులు ఇచ్చి నిబంధనలు పెట్టి నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు అధికార పార్టీ వేల మందితో చేసే కార్యక్రమాలు, సన్మానాలు, ఊరేగింపులకు ఎందుకు వర్తించవని ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని