Ap News: కొప్పర్రు ఘటన.. 16 మంది అనుమానితులు అరెస్టు: ఎస్పీ విశాల్‌ గున్నీ

తాజా వార్తలు

Updated : 25/09/2021 21:43 IST

Ap News: కొప్పర్రు ఘటన.. 16 మంది అనుమానితులు అరెస్టు: ఎస్పీ విశాల్‌ గున్నీ

గుంటూరు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో తెదేపా నాయకురాలు శారద ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఎస్పీ విశాల్‌ గున్నీ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పెదనందిపాడు పోలీసులు 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులను పట్టుకోవడానికి బాపట్ల డీఎస్పీ ఆధ్వర్యంలో బాపట్ల రూరల్ సీఐ, పొన్నూరు రూరల్, పట్టణ సీఐలతో మూడు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. చట్ట పరిధిలో నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సోమవారం అర్ధరాత్రి తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తెదేపా మాజీ జడ్పీటీసీ బత్తిని శారద ఇంటి వద్దకు వచ్చిన వైకాపా కార్యకర్తలు ఆమె ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి దూరి సామగ్రి ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న సామగ్రి, 6 ద్విచక్ర వాహనాలకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని