Ts News: బండి సంజయ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన రాలేదు: వినోద్‌ కుమార్‌

తాజా వార్తలు

Updated : 03/10/2021 15:27 IST

Ts News: బండి సంజయ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన రాలేదు: వినోద్‌ కుమార్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పట్ల భాజపా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అగ్రహం వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదని స్పష్టం చేశారు. అయన పాదయాత్రలో ఎటు చూసినా పచ్చదనమే కనిపించిందని.. అందుకే సంజయ్‌కు ఏమి మాట్లాడాలో తెలియలేదని ఎద్దేవా చేశారు. విద్య, వైద్యం రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరూ చెప్పాల్సిన పని లేదన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు 5 మెడికల్ కళాశాలలుంటే ఇప్పుడు 9 కాలేజీలు ఉన్నాయని.. మరో  నాలుగు కళాశాలలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బండి సంజయ్‌ తెలంగాణ కోసం ఏం మాట్లాడారో చెప్పాలని వినోద్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని