CBN: జాతీయోద్యమ స్ఫూర్తితో పోరాడాలి: చంద్రబాబు

తాజా వార్తలు

Updated : 15/08/2021 20:54 IST

CBN: జాతీయోద్యమ స్ఫూర్తితో పోరాడాలి: చంద్రబాబు

హైదరాబాద్‌: దేశమంతా ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట ఉత్సవాలు చేసుకుంటూ స్వాతంత్ర్య ఉద్యమ క్షణాలను స్మరణకు తెచ్చుకోవడం గర్వంగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని తన నివాసంలో జాతీయ జెండాను ఆయన ఎగురువేశారు. అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ ఈ సందర్భంగా చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అణచివేత నుంచి బయటపడి స్వేచ్ఛగా ఎదగడం కోసమే ఆనాడు మన నేతలు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడారని ఆయన గుర్తు చేశారు. ప్రజల భావాలకు, ఎదుగుదలకు అడుగడుగునా సంకెళ్లు పడుతుంటే మహనీయుల త్యాగాలకు అర్థమేముందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయోద్యమ స్ఫూర్తితో పోరాడి సమాజాన్ని రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని