Chandrababu: తాలిబన్‌ టు తాడేపల్లి లింకులు బయటపెడతాం: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 07/10/2021 01:06 IST

Chandrababu: తాలిబన్‌ టు తాడేపల్లి లింకులు బయటపెడతాం: చంద్రబాబు

అమరావతి: డ్రగ్‌ మాఫియాలో నిజస్వరూపం బయటపడుతుందనే భయంతోనే వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి  చంద్రశేఖర్‌రెడ్డి గూండాలు తెదేపా నేతలపై దాడులకు తెగబడ్డారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దాడులకు బెదరకుండా తాలిబన్‌కు తాడేపల్లికి ఉన్న లింకుల్ని బయటపెట్టి తీరుతామని స్పష్టం చేశారు. కాకినాడలో తెదేపా నేతలపై దాడిని ఖండిస్తున్నట్టు చెప్పారు. రూ.వేల కోట్ల డ్రగ్‌ మాఫియా కార్యకలాపాలు బయటపెట్టిన పట్టాభి, చిన రాజప్ప, కొండబాబు, జ్యోతుల నవీన్‌, రామకృష్ణారెడ్డిలపై కాకినాడ తెదేపా కార్యాలయం వద్ద వైకాపా మూకల దాడి దుర్మార్గమని మండిపడ్డారు. డ్రగ్‌ మాఫియా నాయకుడు ద్వారంపూడి తన మూకతో దాడులకు తెగబడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడులు చేస్తుంటే పోలీసు వ్యవస్థ నిద్రపోతోందా? అని ప్రశ్నించారు. తెదేపా నేతలపై దాడికి దిగిన  మాఫియా మూకల్ని పోలీసులు తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ నేతలకు ఎలాంటి హాని జరిగినా ముఖ్యమంత్రి, డీజీపీ, పోలీసు యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని