Huzurabad By Election: దళితబంధు ఆపాలని నేను లేఖ రాసినట్లు నిరూపిస్తారా?: బండి 

తాజా వార్తలు

Updated : 20/10/2021 13:14 IST

Huzurabad By Election: దళితబంధు ఆపాలని నేను లేఖ రాసినట్లు నిరూపిస్తారా?: బండి 

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం నిలిపివేతపై అధికార పార్టీ తెరాస అబద్ధాలు చెప్తోందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆయన హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘ తెరాస వాళ్లే లేఖ రాసి.. పథకాలు ఆపి.. భాజపాపై నెపం వేస్తారు. ఎన్నికల ముందు పథకాలు ప్రకటించి, ఈసీ పేరు చెప్పి ఆపుతారు. దళితబంధు నిధులు ఖాతాల్లో వేసి విత్‌డ్రా చేసుకోనివ్వలేదు. దళితబంధు నిధులు ఇవ్వాలని భాజపా డిమాండ్‌ చేస్తోంది. దళితబంధు ఆపాలని నేను లేఖ రాసినట్లు సీఎం నిరూపిస్తారా?యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణానికి సిద్ధమా?నాగార్జునసాగర్‌ ఎన్నిక తర్వాత గొర్రెల పంపిణీ పథకం ఆగిపోయింది. గ్రామాల్లో చేపట్టే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తోంది’’ అని బండి సంజయ్‌ అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని