జగన్‌ సీఎంగా ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు: ఏపీ మంత్రి జయరాం

తాజా వార్తలు

Published : 08/09/2021 15:18 IST

జగన్‌ సీఎంగా ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు: ఏపీ మంత్రి జయరాం

అమరావతి: దాదాగిరీ చేయడానికి తానేమీ అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ వీరప్పన్‌ను కాదని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలోని ఆస్పరి పరిధిలో పోలీసులు ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయమని చెప్పానన్నారు. ఆస్పరి ఎస్సైతో మొబైల్‌ ఫోన్‌లో మంత్రి మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో సీఎం జగన్‌ను మంత్రి జయరాం కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్పరి ఎస్సైతో జరిగిన ఫోన్‌ సంభాషణపై వివరణ ఇచ్చారు.

‘‘పోలీసులతో దౌర్జన్యంగా మాట్లాడి ఉంటే నాది తప్పు. నేను చెప్పినదాంట్లో ఎక్కడైనా దౌర్జన్యంగా మాట్లాడినట్లు ఉందా? రైతుల ఖాళీ ట్రాక్టర్లు వదిలేయాలని మాత్రమే చెప్పాను. నాపై బురదచల్లే కార్యక్రమం పెట్టుకోవద్దు. సీఎంను కలిసి నియోజకవర్గ సమస్యలపైనే మాట్లాడాను. అక్కడ ఇతర అంశాలేవీ ప్రస్తావనకు రాలేదు. నా నియోజకవర్గాన్ని ఆనుకునే కర్ణాటక సరిహద్దు ఉంటుంది. మద్యం ఏరులై పారుతుంటే నేనేం చేయగలను?నేనేమైనా అదే పనిగా కాచుకుని కూర్చుంటానా? జగన్‌ సీఎంగా ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని