అమిత్‌ షా వ్యాఖ్యలకు స్టాలిన్‌ కౌంటర్‌

తాజా వార్తలు

Published : 02/03/2021 01:04 IST

అమిత్‌ షా వ్యాఖ్యలకు స్టాలిన్‌ కౌంటర్‌

చెన్నై: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట వేసవికి ముందే రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రత్యర్థుల ఆరోపణలు, విమర్శనాస్త్రాలతో అక్కడి ఎన్నికల ప్రచారం కాక రేపుతోంది. ఆదివారం తమిళనాడులోని విల్లుపురం ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొని ప్రత్యర్థులపై అవినీతి ఆరోపణలు చేశారు. 2జీ అంటే మారన్‌ కుటుంబంలోని రెండు తరాలని, 3జీ అంటే కరుణానిధికి సంబంధించిన మూడు తరాలని, 4జీ అంటే గాంధీ కుటుంబంలోని నాలుగు తరాలని ఆక్షేపించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై డీఎంకే అధినేత స్టాలిన్‌ స్పందించారు.

అవినీతి, కమీషన్లకు, వసూళ్లకు మారుపేర్లయిన ఓపీఎస్‌ (పన్నీరు సెల్వం), ఈపీఎస్‌ (పళని స్వామి)తో అంటకాగుతూ.. తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని స్టాలిన్‌ దుయ్యబట్టారు. దీనిబట్టి అవినీతికి వంతపాడుతోంది ఎవరో అర్థమవుతోందన్నారు. మొన్న మోదీ, నిన్న అమిత్‌ షా, రేపు భాజపా నాయకులు కూడా ఇదే పల్లవి అందుకుంటారని స్టాలిన్‌ అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌-డీఎంకే కూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మేనిఫెస్టో రూపకల్పన సైతం చివరి దశకు చేరుకుందన్నారు. మార్చి 7న తిరుచ్చిలోలో జరిగే ప్రత్యేక సమావేశంలో ‘పదేళ్ల విజన్‌ డాక్యుమెంట్‌’ను ఆవిష్కరిస్తామని స్టాలిన్‌ చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని