పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూ

తాజా వార్తలు

Published : 19/07/2021 01:10 IST

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూ

దిల్లీ: పంజాబ్‌ రాష్ట్ర రాజకీయాల్లో కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఆ రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఎట్టకేలకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కింది. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూని నియమిస్తున్నట్టు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం రాత్రి ప్రకటించారు.

సిద్ధూకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై ఇటీవల తీవ్ర చర్చ జరిగింది. పార్టీ అధిష్ఠానం సుముఖంగా ఉన్నప్పటికీ   సీఎం అమరీందర్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు. హిందూ, దళిత వర్గాలకు చెందిన సీనియర్లను, పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకొని ఉన్నవారిని కాదని సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని లేఖలో పేర్కొన్నారు. కానీ, అమరీందర్‌ సింగ్‌ అభ్యంతరాలను పక్కనపెడుతూ.. సిద్ధూకే పంజాబ్‌ పగ్గాలు అప్పగిస్తూ సోనియా నిర్ణయం తీసుకున్నారు. సిద్ధూతో పాటు మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు వెలువరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని