ap news: కృష్ణా జలాలపై సుప్రీంకు: సజ్జల

తాజా వార్తలు

Updated : 13/07/2021 20:09 IST

ap news: కృష్ణా జలాలపై సుప్రీంకు: సజ్జల

అమరావతి: కృష్ణా జలాల వివాదంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణ చర్యల వల్ల నీరు వృథాగా సముద్రం పాలైందన్నారు. వర్షాలు పడకపోతే రాయలసీమ ప్రాంతానికి అపార నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి జరగరాదనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకోవాలని చెబుతున్నారు... మాట్లాడాలంటే తెలంగాణ నుంచి ఎవరైనా ముందుకు రావాలి కదా అని వ్యాఖ్యానించారు. ఆర్థికశాఖ ఖర్చులను తాము ఎక్కడా దాయడం లేదన్నారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్లే రుణపరిమితిలో కేంద్రం కోత విధించిందన్నారు. కొవిడ్‌ వల్ల ఆర్థిక కష్టాలున్నా.. చాలా ఓపిగ్గా నడిపిస్తున్నామని వివరించారు. నామినేటెడ్‌ పదవులను రేపు లేదా ఎల్లుండి ప్రకటిస్తామని తెలిపారు. 50 శాతం మహిళలకు, 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పదవులు ఇస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని