AP NEWS: కేసీఆర్‌తో చర్చలకు సిద్ధం: సజ్జల

తాజా వార్తలు

Published : 25/06/2021 01:17 IST

AP NEWS: కేసీఆర్‌తో చర్చలకు సిద్ధం: సజ్జల

అమరావతి: రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ, తెలంగాణ మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. సీమ ఎత్తిపోతలకు అనుమతులుంటే... పనులు ఆపాలని కృష్ణా బోర్డు ఎందుకు ఆదేశించిందని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కొందరు తెలంగాణ నేతలు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. ఎవరైనా మాట్లాడితే సమస్య పరిష్కారమయ్యేలా ఉండాలని, విద్వేషాలు పెంచేలా ఉండకూడదన్నారు. సాగునీటి విషయంలో ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నదే సీఎం జగన్‌ విధానమని, అందువల్లే సంయమనం పాటిస్తున్నారని సజ్జల అన్నారు. 

‘‘వెనుకబడిన రాయలసీమకు నీరు అందాల్సిన అవసరం ఉందని గతంలో సీఎం కేసీఆర్‌ చెప్పారు. 80వేల క్యూసెక్కులైనా సరే రాయలసీమకు తీసుకోవాలని చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ నీరు రాయలసీమకు లిఫ్ట్‌ చేయాలన్నారు. రాయలసీమకు నీరు అందేలా చేయడంలో రెండు అడుగులు ముందుంటానని కేసీఆర్‌ గతంలో చెప్పారు. వరద జలాలు ఒడిసి పట్టేందుకే కాలువలు వెడల్పు చేస్తున్నాం. కృష్ణా నదిలో రాష్ట్రానికి కేటాయించిన నీటినే తీసుకుంటున్నాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కృష్ణాలో 800 అడుగుల లోపు నీరుండగానే తెలంగాణ నీటిని పంపింగ్‌ చేస్తోందన్నారు. నీటి వినియోగంపై కేంద్రం నుంచి మానిటరింగ్‌ టీం పెట్టినా ఇబ్బంది లేదన్నారు. పరుషంగా మాట్లాడటం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. సమస్య పరిష్కారం కోసం తెలంగాణ సీఎంతో కూర్చుని చర్చించేందుకు సీఎం జగన్‌ సిద్ధంగా ఉంటారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని