Khel Ratna Award: ఖేల్‌రత్న పేరు మార్పు.. ఓ పొలిటికల్‌ గేమ్‌: శివసేన

తాజా వార్తలు

Published : 10/08/2021 01:41 IST

Khel Ratna Award: ఖేల్‌రత్న పేరు మార్పు.. ఓ పొలిటికల్‌ గేమ్‌: శివసేన

ముంబయి: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న అవార్డు పేరును మార్చడాన్ని శివసేన తప్పుపట్టింది. ఇది ప్రజల అభీష్టం మేరకు మారినది కాదని, ఇదో పొలిటికల్‌ గేమ్‌ అని విమర్శించింది. రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు పేరును ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారంగా మార్చడంపై శివసేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

‘‘ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ఈ దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారు. రాజకీయంగా ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా.. దేశానికి వారు చేసిన త్యాగాలను తక్కువ చేయడం సరికాదు.  రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నను ధ్యాన్‌చంద్‌ పేరిట మార్చడం వెనుక ప్రజాభిప్రాయం ఏమీ లేదు. కేవలం ఇదో పొలిటికల్‌ గేమ్‌ మాత్రమే’’ అని శివసేన విమర్శించింది.

‘‘రాజీవ్‌గాంధీని అవమానించకుండా కూడా ధ్యాన్‌చంద్‌ను గౌరవించుకోవచ్చు. కేవలం రాజకీయ కారణాలతో రాజీవ్‌ పేరును తొలగించడం సరికాదు. క్రికెట్‌కు మోదీ ఏం చేశారన్న కారణంతో అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియానికి తన పేరు పెట్టుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ అంటూ శివసేన ప్రశ్నించింది. ఫిరోజ్‌ షా కోట్లా మైదానానికి అరుణ్‌ జైట్లీ పేరు పెట్టడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారని సంపాదకీయంలో ప్రస్తావించింది. క్రీడలకు బడ్జెట్‌లో రూ.300 కోట్లు కోత పెట్టిన మోదీ ప్రభుత్వం టోక్యోలో భారత్‌ ప్రదర్శనను తన విజయంగా చెప్పుకుంటోందని ఎద్దేవాచేసింది. భారత్‌కు తొలి వ్యక్తిగత ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన ఖషబా దాదాసాహెబ్‌ జాదవ్‌ (కాంస్యం) పేరును ఖేల్‌రత్నకు ఎందుకు పెట్టలేదని శివసేన నిలదీసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని