వైకాపా నుంచి బహిష్కరించారా?: రఘురామ
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 12:16 IST

వైకాపా నుంచి బహిష్కరించారా?: రఘురామ

అమరావతి: వైకాపాలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు ఎపిసోడ్‌ కొనసాగుతోంది. సీఐడీ అధికారులు నమోదు చేసిన రాజద్రోహం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన సీఎం జగన్‌కు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. గతంలోనూ వివిధ అంశాలపై మీడియా ముఖంగా తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.

తాజాగా మరో విషయాన్ని తెరపైకి తెచ్చారు. ‘‘వైకాపా అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపీల జాబితా నుంచి నా పేరు తొలగించారు. పార్టీ నుంచి వైకాపా అధినేత నన్ను బహిష్కరించారా? నాకు ఎలాంటి స్పష్టత లేదు.. ఎవరైనా చెప్పగలరా?’’ అంటూ రఘురామకృష్ణమరాజు ప్రశ్నలు సంధించారు. ఇదిలా ఉండగా.. నిన్న వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ లోక్‌సభ స్పీకర్‌ను కలిసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణమరాజును డిస్‌క్వాలిఫై చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని