Punjab: 15 మంది మంత్రులతో పంజాబ్‌ కేబినెట్‌ ఏర్పాటు

తాజా వార్తలు

Published : 26/09/2021 20:54 IST

Punjab: 15 మంది మంత్రులతో పంజాబ్‌ కేబినెట్‌ ఏర్పాటు

చండీగఢ్‌: పంజాబ్‌లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 15 మందితో కూడిన నూతన మంత్రివర్గ జాబితాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఆదివారం ప్రకటించారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే సీఎం పదవికి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కేబినెట్‌ కూర్పుపై ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే  నూతన మంత్రివర్గ జాబితాను ప్రకటించారు. కాగా గత మంత్రివర్గంలో ఉన్న ఆరుగురిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేశారు.

బ్రహ్మ్ మొహీంద్రా, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, ట్రిప్ట్ రజిందర్ సింగ్ బజ్వా, సుఖ్‌బింద్రసింగ్ సర్కారియా, రానా గుర్జీత్ సింగ్ సహా మరో 10 మంది మంత్రులుగా గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. గత కేబినెట్‌లో తనను విస్మరించారని కలత చెందిన అమ్లోహ్ శాసనసభ్యుడు రణదీప్ సింగ్ నాభాకు ప్రస్తుత మంత్రివర్గంలో చోటుకల్పించారు. కుల్జిత్ నగ్రా స్థానంలో ఆయనను ఎంపిక చేశారు. ఇసుక మాఫియాలో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి రాణా గుర్జిత్‌సింగ్‌ను సైతం కేబినెట్‌కు ఎన్నుకోవడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని