Corona: ప్రధాని ప్రజలను నిరాశపరిచారు
close

తాజా వార్తలు

Published : 13/06/2021 01:04 IST

Corona: ప్రధాని ప్రజలను నిరాశపరిచారు

తీవ్ర విమర్శలు చేసిన ప్రియాంకా గాంధీ

దిల్లీ: కొవిడ్‌ కట్టడిలో విఫలమయ్యారంటూ ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు దేశ ప్రజలకంటే రాజకీయాలే ముఖ్యమని మండిపడ్డారు. ‘ఎవరు బాధ్యులు’ అంటూ కొద్దిరోజులుగా నిర్వహిస్తోన్న ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పలు ప్రశ్నలు వేశారు.

‘ప్రధాని కొవిడ్‌పై పోరాటంలో వెనక్కి తగ్గారు. మహమ్మారి బీభత్సం సృష్టించే వరకూ ఎదురుచూశారు. ఈ దేశ ప్రధాని ఒక భయస్తుడిలా ప్రవర్తించారు. ఆయన దేశ ప్రజలను నిరాశపరిచారు. ఆయనకు ప్రజల కంటే రాజకీయాలే ముఖ్యం. నిజంతో ఆయనకు పట్టింపు లేదు. అసత్య ప్రచారంపైనే దృష్టంతా’ అని ప్రియాంక ఆరోపించారు. ‘ఎవరు బాధ్యులు’ అంటూ ప్రజలు ప్రధానిని ప్రశ్నించే సమయం ఆసన్నమైందని అన్నారు.

దేశంలో కరోనా రెండోదశ తీవ్ర అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారాలు, కుంభమేళా వంటి విషయంలో ప్రభుత్వం వ్యవహరించి తీరు విమర్శలకు దారితీసింది. మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో..ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. ఈ వైరస్‌ కారణంగా దేశంలో 2.9కోట్లకుపైగా కేసులు..3.6లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని