UP: మోదీ సన్నిహితుడికి ఉపాధ్యక్ష పదవి

తాజా వార్తలు

Updated : 20/06/2021 13:30 IST

UP: మోదీ సన్నిహితుడికి ఉపాధ్యక్ష పదవి

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు భాజపా సన్నద్ధం అవుతోంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాల నడుమ ప్రధాని మోదీకి సన్నిహితుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఏకే శర్మకు ఆ పార్టీలో కీలక పదవి దక్కింది. ఆయన యూపీ భాజపా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌సింగ్‌ దిల్లీ పర్యటన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఏకే శర్మ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని ఈ ఏడాది ఆరంభంలో భాజపాలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు.  మరోవైపు భాజపా జాతీయ కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ ఈ నెల 21, 22 తేదీల్లో మరోసారి ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ప్రభుత్వ, పార్టీ పెద్దలతో మంతనాలు జరపనున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ భేటీతో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని