గన్నవరంలో జనసేనానికి ఘన స్వాగతం

తాజా వార్తలు

Updated : 07/07/2021 11:01 IST

గన్నవరంలో జనసేనానికి ఘన స్వాగతం

విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు గన్నవరంలో ఘన స్వాగతం లభించింది. ఇవాళ అమరావతిలో పర్యటించనున్న ఆయన ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలు, జనసైనికులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ముందుగా కొవిడ్‌ బారినపడి మృతి చెందిన వారికి పవన్‌ సంతాపం తెలపనున్నారు. అనంతరం 12 గంటలకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో సమావేశం కానున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని