సాగర్‌ ఉపఎన్నిక: భారీ పోలింగ్‌ నమోదు

తాజా వార్తలు

Updated : 17/04/2021 19:30 IST

సాగర్‌ ఉపఎన్నిక: భారీ పోలింగ్‌ నమోదు

హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉప ఎన్నికకు ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉప ఎన్నికలో భారీ పోలింగ్‌ నమోదు అయింది. సాయంత్రం 5 గంటల వరకు 81.5 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకే పార్టీ ప్రతినిధులను అనుమతించడం, ఓటరు రసీదులు సిబ్బంది నుంచి మాత్రమే తీసుకోవాలని ఈసీ ఆదేశించినందున పోలింగ్‌ కేంద్రాల వద్ద హడావుడి తగ్గింది. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్ల పోలింగ్‌ పూర్తవగా.. 6 నుంచి 7 గంటల మధ్య కరోనా బాధితులు ఓటు వేశారు. సాగర్‌ ఉప ఎన్నిక బరిలో 41 మంది అభ్యర్థులు నిలిచారు. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని