Raghurma: నాపై అన‌ర్హ‌త సాధ్యం కాదు
close

తాజా వార్తలు

Updated : 12/06/2021 10:16 IST

Raghurma: నాపై అన‌ర్హ‌త సాధ్యం కాదు

అమ‌రావ‌తి: తాను ఏ పార్టీతోనూ జట్టుక‌ట్ట‌లేద‌ని.. అధికార పార్టీ కార్య‌క‌లాపాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌లేదని న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు అన్నారు. వైకాపా ఎంపీగా ఎన్నికైన రఘురామ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు లోక్‌సభలో వైకాపా చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ శుక్రవారం ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఎంపీ స్పందించారు. ప్ర‌భుత్వ సంక్షేమ ఫ‌లితాల అమ‌లులో లోపాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించాన‌ని.. తనపై అన‌ర్హ‌త వేటు వేయ‌డం సాధ్యం కాద‌ని వివ‌రించారు.

'' కొంత‌మంది త‌ప్పుడు వ్య‌క్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశా. వాస్త‌వాలు ఎప్ప‌టికైనా బ‌య‌ట‌కు వ‌స్తాయి. నాపై దాడి చేసిన వారి విష‌యంలో మ‌రోసారి ప్రివిలైజ్‌ మోష‌న్ ఇస్తా. నాపై ఈ నెల 10న ఫిర్యాదు చేసి 11న చేసిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్నారు. హోంమంత్రిని సీఎం క‌లిశాకే ఫిర్యాదు చేసిన‌ట్లు చెబుతున్నారు. అన‌ర్హ‌త వేటుపై ఇప్ప‌టికే నాపై నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారు''   అని ర‌ఘురామ అన్నారు.

రఘు రామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలు సమర్పించామని భరత్ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజుపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని ఎంపీ భ‌ర‌త్ స్పీక‌ర్‌కు విన్న‌వించిన విష‌యం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని