Ap News: జగన్‌కు రఘురామ మరో లేఖ
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 10:08 IST

Ap News: జగన్‌కు రఘురామ మరో లేఖ

అమరావతి: చట్టబద్ధమైన పోస్టులో వయస్సు సడలింపుతో నియమించడం తగదని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు నవ కర్తవ్యాల పేరుతో రఘురామ ఈ మేరకు ఐదో లేఖ రాశారు. ఏపీ పోలీస్‌ కంప్లెయింట్స్‌ అథారిటీ(పీసీఏ) ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్‌ వి.కనగరాజు నియామకాన్ని రఘురామ తప్పుబట్టారు. 65 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు మాత్రమే పదవికి అర్హులని తన లేఖలో పేర్కొన్నారు. జస్టిస్‌ కనగరాజును నియమించేందుకు ప్రణాళిక ప్రకారమే నిబంధనలు సవరించారన్నారు. 2020 ఏప్రిల్‌లో ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజును నియమించారన్న రఘురామ.. నెలలోపే నియామక ఆదేశాలను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని