‘కేజ్రీవాల్‌ని అడ్డుకోవాలనే మోదీ ఆ బిల్లు తెచ్చారు’ 

తాజా వార్తలు

Published : 25/03/2021 18:15 IST

‘కేజ్రీవాల్‌ని అడ్డుకోవాలనే మోదీ ఆ బిల్లు తెచ్చారు’ 

మోదీకి కేజ్రీవాలే ప్రత్యామ్నయమన్న సిసోడియా

దిల్లీ: దేశ రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చూస్తున్నారని ఆప్‌ నేత, దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోపించారు. ఇందులో భాగంగానే లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు కల్పించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారన్నారు. మోదీ నేతృత్వంలోని భాజపా  ప్రభుత్వం కేజ్రీవాల్‌ పనితీరుతో అభద్రతా భావానికి లోనై ఈ బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. మోదీకి కేజ్రీవాలే ప్రత్యామ్నాయం అనే చర్చ ప్రజల్లో మొదలైందని వ్యాఖ్యానించారు. అందుకే కేజ్రీవాల్‌ను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకొనేందుకే దిల్లీ జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు -2021ను తీసుకొచ్చారన్నారు. 

ప్రధాని మోదీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని సిసోడియా ఆరోపించారు. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వేళ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని, తమకు ఉన్న అవకాశాల అన్వేషణ కొనసాగిస్తున్నట్టు చెప్పారు. దిల్లీలో అభివృద్ధిని ప్రధాని అడ్డుకుంటున్నారన్న సిసోడియా.. ఆయన దేశానికి ప్రధాని అని, చేయాలనుకుంటే ఎక్కడైనా మంచిపనిచేయొచ్చన్నారు.

 ‘దిల్లీ ప్రభుత్వమంటే లెఫ్టినెంట్‌ గవర్నరే’ అనే బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలపగా.. బుధవారం విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. రాజ్యసభలో ఈ బిల్లుకు నిరసనగా బీజేడీ, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని