Mamata Banerjee: భవానీపూర్‌ నుంచి దీదీ నామినేషన్‌

తాజా వార్తలు

Updated : 10/09/2021 16:51 IST

Mamata Banerjee: భవానీపూర్‌ నుంచి దీదీ నామినేషన్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికల జోరు మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలోకి దిగుతున్న భవానీపూర్‌ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నిక కోసం దీదీ నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే మమతకు పోటీగా న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ను భాజపా బరిలోకి దించుతోన్న విషయం తెలిసిందే. 

బెంగాల్‌లోని భవానీపూర్‌తో పాటు శంషేర్‌గంజ్‌, జాంగిపూర్‌ నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్‌ జరగనుంది. అక్టోబరు 3న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్‌ నుంచి తృణమూల్ నేత సోభాందేవ్‌ ఛటోపాధ్యాయ పోటీ చేసి విజయం సాధించారు. అయితే నందిగ్రామ్‌లో మమత ఓడిపోయిన నేపథ్యంలో సోభాందేవ్‌ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక  భవానీపూర్‌ నుంచి దీదీ గతంలో రెండు సార్లు విజయఢంకా మోగించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని