సాగర్‌ ఉపఎన్నిక: 88శాతం పోలింగ్ నమోదు

తాజా వార్తలు

Published : 17/04/2021 21:40 IST

సాగర్‌ ఉపఎన్నిక: 88శాతం పోలింగ్ నమోదు

హైదరాబాద్‌: నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ సాఫీగా సాగిందని.. సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 88శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు బాగా పాటించారని.. తగిన చర్యలు తీసుకున్నందు వల్లే ఓటర్లు ధైర్యంగా వచ్చి ఉత్సాహంతో ఓటు వేశారన్నారు. 36 మంది కరోనా రోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారని సీఈఓ తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియపై ఎక్కడా.. ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 346 పోలింగ్ కేంద్రాల్లో సజావుగా పోలింగ్ జరిగిందని చెప్పారు. ఓటర్ల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. రాజకీయ పార్టీల సమక్షంలో నల్గొండలో ఈవీఎంలను భద్రపరుస్తామని వెల్లడించారు. అభ్యర్థులు, ఏజెంట్లు స్ట్రాంగ్ రూంను సందర్శించవచ్చని వివరించారు. స్ట్రాంగ్ రూం వద్ద 24 గంటల పాటు కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుందని గోయల్ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని