ఓటేసి తెరాసకు మద్దతివ్వండి: హోంమంత్రి

తాజా వార్తలు

Published : 10/03/2021 10:49 IST

ఓటేసి తెరాసకు మద్దతివ్వండి: హోంమంత్రి

హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి మద్దతుగా హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఈ ఉదయం ఆయన ప్రచారం నిర్వహించారు. ఉదయపు నడకకు వచ్చిన వారితో మాట్లాడిన మంత్రి.. తెరాస సర్కారు చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. రెండు స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. 

తెరాస ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు మహమూద్‌ అలీ వివరించారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం 1,33,001 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. అనేక పరిశ్రమలు పెట్టుబడుల ప్రోత్సాహంతో హైదరాబాద్ నగరం అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నట్లు ఆయన వివరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని